Subscribe Us

header ads

GOVINDADI NAMOCHCHARANA ANNAMAYYA KEERTHANA TELUGU LYRICS

 


GOVINDADI NAMOCHCHARANA ANNAMAYYA KEERTHANA TELUGU LYRICS




SUNG BY GARIMELLA BALA KRISHNA PRASAD


TELUGU LYRICS


గోవిందాది నామోచ్ఛారణ

గానం: శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు

          

రేకు: 258-2

సంపుటము: 3-332

రేకు రాగము: ముఖారి.


Music Label: Adithya Music


పల్లవి


గోవిందాది నామోచ్ఛారణ

కొల్లలు దొరకెను మనకిపుడు

ఆవలనీవల నోరగుమ్మలుగ

ఆడుద మీతని పాడుదము!!


ll గోవింద హరి గోవింద 

గోకులా నందన గోవింద ll


సత్యము సత్యము సకలసురలలో

నిత్యుడు శ్రీహరి నిర్మలుడు

ప్రత్యక్షమిదే ప్రాణులలోపల

అత్యంతము శరణనరో యితని!!


ll గోవింద హరి గోవింద 

గోకులా నందన గోవింద ll


చాటెడి చాటెడి సకలవేదములు

పాటించినహరి పరమమని

కూటస్థుడితడు గోపవధూపతి

కోటికి యీతని కొలువరో జనులు!!


ll గోవింద హరి గోవింద 

గోకులా నందన గోవింద ll


నిలుచున్నాడిదె నేడును నెదుటను

కలిగిన శ్రీవేంకటవిభుడు

వలసినవారికి వరదుండీతడు

కలడు కలడితని కని మనరో!!..

ll గోవింద హరి గోవింద 

గోకులా నందన గోవింద ll


Music Label: Adithya Music


భావము:- 

గోవిందుని నామమును ఉచ్చరించుటకు ఇప్పుడు కొల్లలుగా (అధికముగా) మనకు దొరికింది. ఓ భక్తులారా! ఆవల ఈవల ఆడుదము. మన నోరు గుమ్మలుగ (నోరారా) ఈతనిని పాడుదము (కీర్తించెదము) అంటున్నారు అన్నమాచార్యులవారు. శ్రీహరి నామ మహిమను వర్ణిస్తున్నారు. తిరుమలలోని స్వామిని మన కనుల యెదుట ప్రత్యక్షం చేస్తున్నారు. “కలడు

కలండనెడివాడు కలడో లేడో” అని గజేంద్రుడు సందేహించాడు కాని, అన్నమయ్య "కలడు కలడితని కని మనరో” అంటున్నారు.


ఇప్పుడు మనకు గోవింద మొదలైన విష్ణునామాలు కొల్లలుగా (అపరిమితముగా) దొరికినవి (లభించినవి). ఆవలనీవల నాడుదము (అక్కడా ఇక్కడా నర్తించెదము. నోరు గుమ్మలుగా (నోరు పండు విధముగా) పాడెదము(కీర్తించెదము).  మనం తరించుటకు ఆనామోచ్చరణే సరైన తరుణోపాయం

     

ఈమాట సత్యము, సత్యము. శ్రీహరి దేవతలందరిలో నిత్యుడు (నిత్యమూ కలుగువాడు). ఆయన నిర్మలుడు (పవిత్రుడు). ప్రత్యక్షముగా ప్రాణము రూపంలో ఈయన సర్వజీవులలో వున్నాడు. అత్యంత భక్తితో ఈయనను శరణు

వేడండి.


సకల వేదములు శ్రీహరి పరమము (సర్వశ్రేష్ఠుడు) పరమాత్మ అని మరీ మరీ చాటినవి. ఆయన కూటస్థుడు ( అంతర్యామి ). గోపికలు వరించిన మనోహరుడు. ఈతనిని జనులందరూ కోటికి (అతిశయముగా) కొలువరో (సేవించండయ్యా).


ఈ స్వామి నేడు మన యెదుటనే నిలిచియున్నాడు. ఈయనే శ్రీ వేంకటేశ్వరుడు. ఈతడు వలసిన వారికి (ఆర్తులకు) వరదుడు

( వరములనను గ్రహించువాడు ). ఇతడు కలడు కలడని (ఉన్నాడు ఉన్నాడని) కని మీ ఆత్మలో దర్శించి మనరో జీవించండి. అదే మీకు ముక్తినిస్తుంది.


THANKS FOR READING

FOLLOW US
&
PLEASE SUBSCRIBE

DISCLAIMER NO COPYRIGHT INFRINGEMENT OR COMMERCIAL GAINS ARE INTENDED. THIS IS ONLY INFORMATIVE AND EDUCATIONAL PURPOSES ARTICLE

All Devotional Songs In This Site Are For Promotional Purpose Only.

Please Share And Post A Comment

Post a Comment

0 Comments