కొండవాడు మా అయ్యప్పా
Kondavadu Maa Ayyappa Swamy Song Lyrics
🙏సర్వేజనాఃసుఖినోభవంతు:🌼🙏🌼
-------------------
🏵️ *మహనీయుని మాట*🏵️
-------------------------
"ధర్మమొక్కటే పరమశ్రేయస్సును కలిగించును.
ఓర్పు ఒక్కటే ఉత్తమమైన శాంతినిస్తుంది.
చదువొక్కటే మిక్కిలి తృప్తిని ప్రసాదించును.
అహింస ఒక్కటే సుఖాన్ని చేకూర్చును."
--------------------------
🌹 *నేటి మంచి మాట* 🌹
---------------------------
"ఎక్కువ కావాలనే కోరిక తగ్గినప్పుడు మనసు హాయిగా మారుతుంది. ఉన్నదానిని విలువగా భావించినప్పుడే సంతోషం నిలుస్తుంది."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
卐🕉️ 🙏🏻
పల్లవి
కొండవాడు మా అయ్యప్పా
జాలి గుండె వాడు మా అయ్యప్పా
ఓహో హో అయ్యప్పా శరణమో అయ్యప్పా ..2.. ||కొం||
చరణం 1.
నీలాల నింగిలోన చుక్కల్లో చందురుడు
నీలగిరి కొండల్లో కొలువుతీరి ఉన్నావు
నీలకంఠుని పుత్రుడు అయ్యప్ప
మణికంఠ నామదేయుడు ఓహో..
||కొం||
చరణం 2. .
రాగాలేమాకురావు తాళాలు మాకు లేవు
అరుపులే మా పిలుపులు అయ్యప్ప
శరణాలే మేలుకొలుపులు ఓహో…
||కొం||
చరణం 3.
పెద్దదారిలోన నడిచి వెళ్ళుతుంటే – చిన్నదారిలోన నడచి వెళ్ళుతుంటే
దారిలోన కనిపిస్తాడు అయ్యప్ప శరణాలే పలికిస్తాడు ఓహో..
||కొం||

0 Comments