అది గదిగో శబరి మలా
Adhigadhigo Shabarimala Ayyappa Swamy Song Lyrics
🙏సర్వేజనాఃసుఖినోభవంతు:🌼🙏🌼
-------------------
🏵️ *మహనీయుని మాట*🏵️
-------------------------
"ఆనందం అకస్మాత్తుగా రాదు.
కలలు వాటంతటవే నెరవేరవు.
మనం నిబద్ధతతో ఉండాలి. కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేయడం అత్యంత గౌరవనీయమైన మానవ ధర్మం."
--------------------------
🌹 *నేటి మంచి మాట* 🌹
---------------------------
"మంచి మనసుంటే చుట్టూ ఉన్న బంధాలన్నీ అందంగా కనిపిస్తాయి."."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
卐🕉️ 🙏🏻
పల్లవి
అది గదిగో శబరి మలా – అయ్యప్పస్వామి ఉన్న మలా
అది గదిగో పళణి మలా – అయ్యప్ప సోదరుడు ఉన్న మలా
శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణ మయ్యప్ప స్వామియే
స్వామియే అయ్యపా – అయ్యప్పా స్వామియె
అదిగదిగో శబరిమల – శివకేశవులు ఉన్నమల
ఉన్నవారిని లేనివారిని తేడలేనిది శబరిమల
కులమొ మతమొ, జాతి భేదము తేడలేనిది శబరిమల ||శరణమయ్యప్ప||
చరణం 1
అదిగదిగో పళనిమల శివపార్వతుల ఉన్నమల
కైలాసం వైకుంఠం కలసిఉన్నది శబరిమల
ఈశ్వర హృదయం మాధవనిలయం కలిసిఉన్నది శబరిమల
||శరణమ||
చరణం 2
అదిగదిగో పంపానది, దక్షిణభారత గంగానది
ఈశ్వర కేశవ నందునందుని పాదముకడిగిన పుణ్యనది
చరణం 3
అదిగదిగో శబరి పీఠం భక్తజనులకిది ముక్తిపీఠం
శబరిఎంగిలి ఆరగించిన రాముడు నడిచిన పుణ్యస్ధలం
చరణం 4
అదిగదిగో కాంతమల అక్కడ వెలుగును మకరజ్యోతి
హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామికి హారతి ఇచ్చేదీపమది
||శరణమ||


0 Comments