అయ్యప్ప స్వామినీ చూడాలంటే
Ayyappa Swamyni Choodaalante Ayyappa Swamy Song Lyrics
🙏సర్వేజనాఃసుఖినోభవంతు:🌼🙏🌼
-------------------
🏵️ *మహనీయుని మాట*🏵️
-------------------------
"ఆనందం అకస్మాత్తుగా రాదు.
కలలు వాటంతటవే నెరవేరవు.
మనం నిబద్ధతతో ఉండాలి. కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేయడం అత్యంత గౌరవనీయమైన మానవ ధర్మం."
--------------------------
🌹 *నేటి మంచి మాట* 🌹
---------------------------
"ఎవరూ చూడనప్పుడు కూడా మంచిగా ఉండటం నిజమైన మనిషితనం. అదే మన విలువను నిరూపిస్తుంది.""."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
卐🕉️ 🙏🏻
అయ్యప్ప స్వామినీ చూడాలంటే కొండకు వెళ్ళాలి
అయ్యప్ప స్వామినీ చూడలంటే కొండలకు వెళ్ళాలి
శబరి కొండకు వెళ్ళాలి
శబరి కొండకు వెళ్ళాలి
శబరి కొండకు వెళ్ళాలి
స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప
||స్వామి||
చరణం 1
కార్తీకంలో మాలలు వేసి పూజలు చేయాలి
మండల పూజలు చేయాలి
మండల పూజలు చేయాలి
మండల పూజలు చేయాలి
||స్వామి||
చరణం 2
యిరుముడికట్టి శరణము చెప్పి యాత్రకు వెళ్ళాలి
శబరి యత్రకు వెళ్ళాలి
శబరి యత్రకు వెళ్ళాలి
శబరి యత్రకు వెళ్ళాలి
||స్వామి||
చరణం 3
ఎరుమేలి వెళ్ళి వేషాలు వేసి పేట ఆడాలి
పేటైసుల్లి ఆడాలి
పేటైసుల్లి ఆడాలి
పేటైసుల్లి ఆడాలి
స్వామి తింతకతోం అయ్యప్ప తింతకతోం
స్వామి తింతకతోం అయ్యప్ప తింతకతోం
||స్వామి||
చరణం 4
ఆలుదానదిలో స్నానం చేసి రాళ్ళను తీయాలి
రెండు రాళ్ళను తీయాలి
రెండు రాళ్ళను తీయాలి
రెండు రాళ్ళను తీయాలి
||స్వామి||
చరణం 5
పంపానదిలో స్నానము చేసి పావనమవ్వాలి
మనము పావనము అవ్వాలి
మనము పావనము అవ్వాలి
మనము పావనము అవ్వాలి
||స్వామి||
ఆపై పదునేమిది మెట్లే ఎక్కాలి
సన్నిధానమే చేరాలి
అయ్యప్ప స్వామిని చూడాలి
కొబ్బరి కాయలె కొట్టాలి
మంజుమాతనే మొక్కాలి
మకర జ్యోతి నే చూడాలి
జన్మ ధన్యమే కావాలి
స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప


0 Comments