Subscribe Us

header ads

Raja Raja Pandhala Raja Ayyappa Swamy Song Lyrics

 రాజా రాజా పందల రాజ

Raja Raja Pandhala Raja Ayyappa Swamy Song Lyrics 




🙏సర్వేజనాఃసుఖినోభవంతు:🌼🙏🌼

   -------------------

🏵️ *మహనీయుని మాట*🏵️

        -------------------------

"చిన్న అడుగుతో మొదలైన ప్రయాణమే గొప్ప విజయాల దారిని చూపుతుంది.

ఆప్తులు లేకపోయినా నమ్మకం మనతో ఉంటుంది.

ప్రయత్నం ఆగకపోతే గమ్యం దూరం కాదు.

మీ దగ్గర ఉన్న మీ నమ్మకమే ఆయుధం."

       --------------------------

🌹 *నేటి మంచి మాట* 🌹

      ---------------------------

"ఎదుటివారిని అర్థం చేసుకోవడం దయ మొదటి మెట్టు. ఆ భావం లేకపోతే సహాయం కూడా నిరర్థకం."."

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

卐🕉️ 🙏🏻


పల్లవి 


రాజా రాజా పందల రాజ – నీవు పంబానది తీరాన కీర్తించేవు 

 ||2||

శరణం అయ్యప్పా శరణం స్వామి – 

స్వామీ అయ్యప్పా శరణం స్వామి

అన్నదాన ప్రభువా శరణం స్వామి – 

పొన్నంబలవాసా శరణం స్వామి


చరణం 1

అలుద పంబ జలములోన తీపివి నీవే

అడవిలోని జీవాల ఆటవు నీవే

బంగారు కొండపైన వేదము నీవే

పంచగిరులు ధ్వనియించే నాధము నీవే      

   ||శరణం అయ్యప్పా||


చరణం 2 

భూతదయను బోధించిన కరుణామూర్తి

భూతనాధ సదానంద శాంతమూర్తి

ఇంద్రియములు జయించినా సుందరమూర్తి

ఇరుముడులను కడతేర్చే దివ్యమూర్తి 

        ||శరణం అయ్యప్పా||


చరణం 3

వావరున్ని వాల్మీకిగ మలచినావయా

వనములోన ఘనముగా నిలిచినావయా

గురుపుత్రుని కరుణించే శ్రీ గురునాధా

మా నయనాల కాంతివి నీవే కాదా    

     ||శరణం అయ్యప్పా|


చరణం 4

తల్లిదండ్రుల పూజించే నీ భావనలూ

గురువులు గౌరవించు నీ సేవలూ

కలియుగమును రక్షించే అభయ హస్తమూ

ఓ తండ్రి నీవేలే మా సమస్తమూ         

||శరణం అయ్యప్పా||

Post a Comment

0 Comments